పని పూర్తి

13 Feb, 2020 00:57 IST|Sakshi
త్రిష

‘రాంగీ’ చిత్రం కోసం ఉబ్జెకిస్తాన్‌కు మళ్లీ వెళ్లారు హీరోయిన్‌ త్రిష. మొదటిసారి వెళ్లినప్పుడు కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు, పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. మళ్లీ త్రిష ఉబ్జెకిస్తాన్‌కు వెళ్లింది ‘రాంగీ’ సినిమాలో తన పాత్రలో మిగిలిన చిన్న భాగం చిత్రీకరణ కోసమే. దీంతో ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన పని పూర్తయిందని పేర్కొన్నారు త్రిష. ఎ

మ్‌. శరవణన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ కథ, మాటలు అందించడం విశేషం. సి. సత్య ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’ (వర్కింగ్‌ టైటిల్‌), మలయాళంలో మోహన్‌లాల్‌ ‘రామ్‌’ చిత్రాలతో పాటు ఎప్పటిలాగే కొన్ని తమిళ ప్రాజెక్ట్స్‌తో ఈ ఏడాది కూడా తీరిక లేకుండా ఉన్నారు త్రిష.

మరిన్ని వార్తలు