మోడర్న్ పిశాచి!

19 Oct, 2016 23:44 IST|Sakshi
మోడర్న్ పిశాచి!

అవతారం చూస్తే అమ్మవారి మోడర్న్ లుక్ అన్నట్టుంది కదూ! మహిమలు గల మహిషాసుర మర్దిని కాదు.. ప్రతీకార జ్వాలతో రగులుతున్న పిశాచి అట. త్రిష కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఇది. ఈ  మోడర్న్  పిశాచి పగ ఎవరిపై అనేది త్రిష చెబితేనే తెలుస్తుంది. ఆర్.మాదేశ్ దర్శకత్వంలో త్రిష ముఖ్యతారగా నటిస్తున్న హారర్ సినిమా ‘మోహిని’. ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు.. పక్కనే కపాలాలు.. తలపై విచిత్రమైన కిరీటం.. ఈ సినిమాలో త్రిష ఫస్ట్ లుక్‌ను విభిన్నంగా విడుదల చేశారు.
 
  నవంబర్ మొదటి వారంలో పాటల్ని, క్రిస్మస్‌కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘మోడర్న్ హారర్ కామెడీ సినిమా ఇది. మహిళల దూకుడుకి చిహ్నంగా వివిధ ఆయుధాలతో త్రిష ఫస్ట్ లుక్‌ని డిజైన్ చేశాం. ఓ యాక్షన్ సీక్వెన్స్ మినహా 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. బ్యాంకాక్‌లో మిగిలిన యాక్షన్ సీక్వెన్స్‌ని షూట్ చేస్తాం. ‘హ్యారీ పోటర్’ సినిమాకి పనిచేసిన వి.ఎఫ్.ఎక్స్. నిపుణులు మా చిత్రానికి పని చేస్తున్నారు’’ అన్నారు.