అరవిందస్వామితో రొమాన్స్‌కు సై

23 Sep, 2016 02:40 IST|Sakshi
అరవిందస్వామితో రొమాన్స్‌కు సై

 అరవిందస్వామితో రొమాన్స్‌కు త్రిష సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. రోజా చిత్రం తరువాత ఆ చిత్ర హీరో అరవిందస్వామికి యువత ఫాలోయింగ్ ముఖ్యంగా అమ్మాయిల మధ్య ఎంతగా క్రేజ్ పెరిగిందో తెలిసిందే.అలాంటి అరవిందస్వామి కొంత కాలం సినిమాలకు దూరం కావడం చాలా మంది తట్టుకోలేక పోయారు. అయితే కడల్ చిత్రంతో రీఎంట్రీ అయిన ఈ చార్మింగ్ నటుడు ఇటీవల తనీఒరవన్ చిత్రంలో జయం రవికి విలన్‌గా మారి తనదైన స్టైల్ నటనతో మెప్పించారు.కాగా తాజాగా మరో సారి హీరోగా అవతారమెత్తనున్నట్లు సమాచారం.2014లో తరపైకి వచ్చి అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రం చదురంగ వేట్టై.ఈ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ తాజాగా దానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సిద్ధం అవుతున్నారు.
 
 చదురంగ వేట్టై చిత్రాన్ని నిర్మించిన నటుడు,దర్శకుడు మనోబాలానే ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.కాగా తొలి భాగంలో హీరోగా నటించిన నట్టి(నటరాజ్) కు బదులు దాని సీక్వెల్‌లో అరవిందస్వామి నటించనున్నారని తెలిసింది. చదురంగ వేట్టై చిత్రం కంటే మరింత భారీగా తెరకెక్కించనున్న ఈ సీక్వెల్‌లో టాప్ నటిని హీరోయిన్‌గా ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటి త్రిషను నటింపజేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం త్రిష చేతిలో మోహినీ చిత్రం మాత్రమే ఉంది. దీంతో అరవిందస్వామితో రొమాన్స్ సై అంటారనే టాక్ వినిపిస్తోంది.కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన త్వరలో వెలువడనుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా