పవర్‌ ఫుల్‌ రాంగీ

18 Aug, 2019 00:15 IST|Sakshi

‘రాంగీ’ అనే తమిళ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో త్రిష కనిపించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో స్టంట్స్‌ అన్నీ స్వయంగా త్రిషానే చేస్తున్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం బులెట్‌ నడపడం కూడా నేర్చుకున్నారట. యం. శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఉజ్బెకిస్తాన్‌లో జరగనుంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో ఎక్కువ యాక్షన్‌ సన్నివేశాలనే చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట. ఈ ఏడాది చివర్లో సినిమా రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు