సీక్వెల్‌కి టీజర్‌?

14 May, 2020 05:55 IST|Sakshi

శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించిన క్లాసిక్‌ లవ్‌ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్‌ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్‌ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్‌ మీనన్‌. తాజాగా జెస్సీ, కార్తీక్‌ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కిస్తున్నారు మీనన్‌. ‘కార్తీక్‌ డయల్‌ సెయ్ద ఎన్‌’ టైటిల్‌తో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్‌ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్‌ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా ఓ టీజర్‌లా మీనన్‌ చూపించబోతున్నారని టాక్‌.

మరిన్ని వార్తలు