‘అఆ’.. 200 మిలియన్‌ వ్యూసా!!

13 Jun, 2020 15:50 IST|Sakshi

యంగ్‌ హీరో నితిన్‌, సమంత జంటగా తెరపై కనువిందు చేసిన చిత్రం ‘అఆ’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ కుటంబ కథా చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రేమ, కుటుంబ విలువలు.. ఈ రెండింటిని బ్యాలెన్స్‌ చేస్తూనే తన దైన కామెడీ టైమింగ్‌ను జోడించారు త్రివిక్రమ్‌. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నిత్యం ఏదో ఒక ఘనతను తన ఖాతాలో వేసుకుంటోంది. ‘ఆఆ’ చిత్రం హిందీ వర్షన్‌లో అనేక రికార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే వన్‌ మిలియన్‌ లైక్స్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మరో మైలురాయిని అందుకుంది. 

తాజాగా హిందీ వర్షన్‌లో వచ్చిన ‘ఆఆ’ చిత్రానికి యూట్యూబ్‌లో 200 మిలియన్‌ వ్యూస్‌ రావడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని భారీగా ఆదరిస్తుండటం పట్ల హీరో నితిన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేశాడు ఇక టాలీవుడ్‌లో అంతగా ఆకట్టుకొని నితిన్‌ చిత్రాలు సైతం హిందీ వర్షన్‌లో భారీ హిట్టవుతున్నాయి. తాజాగా అఆ, చ‌ల్ మోహ‌న్ రంగ‌, శ్రీనివాస క‌ళ్యాణం హిందీ డ‌బ్ వర్షన్‌కు యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 400 మిలియ‌న్లకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆదిత్య మ్యూజిక్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

సౌత్ ఇండియాలోనే అగ్ర‌గామి మ్యూజిక్ కంపెనీగా కొన‌సాగుతున్న ఆదిత్య మ్యూజిక్ వారు నిర్వ‌హిస్తున్న ఆదిత్య మూవీస్ విభాగానికి సంబంధించిన యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఈ సినిమాను అప్‌లోడ్‌ చేశారు. వివద తెలుగు హీరోల హిందీ డబ్బింగ్‌ సినిమాలను ఆదిత్య మూవీస్‌ యూట్యూబ్‌లో విడుదల చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ హీరోల హిందీ డబ్బింగ్‌ సినిమాలకు భారీగా వ్యూస్‌ వస్తున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు