‘తాప్సీకి నటించడం రాదు’

8 Jul, 2019 19:12 IST|Sakshi

వరుస విజయాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు హీరోయిన్‌ తాప్సీ. తాజాగా తాప్సీ నటించిన గేమ్‌ ఓవర్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాప్సీ త్వరలోనే అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందని పేర్కొంటూ దర్శకుడితో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు తాప్సీ.
 

దీనిపై విశాల్‌ అనే నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ.. ‘అనుభవ్‌ సర్‌, మీ సినిమాలో తాప్సీకి బదులు మరో నటిని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తాప్సీకి నటించడం రాదు’ అని కామెంట్‌ చేశాడు. దీనిపై స్పందించిన తాప్సీ అతనికి దిమ్మతిరిగే  సమాధానం ఇచ్చింది. ‘సారీ.. ఇప్పుడేం చేయలేవ్‌. ఎందుకంటే సినిమాకు సంతకం చేసేశాను. ఇప్పుడు అనుభవ్‌ సర్‌ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా నేను అది జరగనివ్వను. ఒక పనిచెయ్‌. నేను మరో సినిమాకు సంతకం చేసేలోపు ఆ చిత్రంలో నన్ను ఎవ్వరూ తీసుకోకుండా ఆపి చూడు’ అని ఛాలెంజ్‌ విసిరారు. బాగా బుద్ది చెప్పారంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు