బి.సరోజాదేవికి ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం

23 Feb, 2019 16:23 IST|Sakshi

అలనాటి అందాల నటి బి.సరోజాదేవిని టీఎస్ఆర్‌ లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి' బిరుదు తో సత్కరించనుంది. కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి సందర్భంగా విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదును ప్రదానం చేయనున్నట్టుగా తెలిపారు. విశాఖ రామకృష్ణా బీచ్ లో మార్చి 4 సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలచేతనే కోటి శివలింగాల ప్రతిష్ఠాపన, మహాకుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

గత పాతికేళ్ల ఈ కార్యక్రమాలను టీఎస్సార్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మిస్తున్న బి.సరోజాదేవి సన్మాన కార్యక్రమంలో ప్రముఖ నటీనటులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, సుమన్, మీనా, గాయని పి.సుశీల పాల్గొననున్నారు. కన్నడ నాట జన్మించిన బి.సరోజాదేవి, తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులు.

 ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమా ద్వారా బి.సరోజాదేవిని తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ సరసన సీతారామకళ్యాణం, జగదేకవీరుని కథ, దానవీరశూర కర్ణ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావుతోనూ పెళ్ళికానుక, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న లాంటి సినిమాలో అలరించారు. తెలుగునాటనే కాకుండా, మాతృభాష కన్నడలోనూ, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ సరోజాదేవి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను సైతం అందుకున్నారు.

మరిన్ని వార్తలు