పాపం ప్రేమికుడు

26 Mar, 2018 01:01 IST|Sakshi
సెలెనా గోమేజ్, జస్టిన్‌ బీబర్, బాస్కిన్‌ చాంపియన్‌

హాలీవుడ్‌ స్పైస్‌

ప్రేమలో ఉన్నవాళ్లు వింతగా కనిపిస్తారు. ఎప్పుడెలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రేమలో విఫలమైన వాళ్లూ అంతే! ఈ రెండింటికీ మధ్యన ఉండే వాళ్లతోనే అసలు సమస్య అంతా. వాళ్లకు ఏం జరుగుతోందో అర్థం కాదు. ఏం చేస్తున్నారో అంతకుమించి అర్థం కాదు. నవ్వుతారు. ఏడుస్తారు. ఇంకేదేదో చేస్తుంటారు. అచ్చం మన పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌లాగా! జస్టిన్, సెలెనా గోమేజ్‌లది ఎనిమిదేళ్ల ప్రేమ. అలా అని ఎనిమిదేళ్లుగా కలిసే ఉంటున్నారా అంటే లేదు.

కొన్నాళ్లు కలిసి ఉంటారు. కొన్నాళ్లకు విడిపోతారు. మళ్లీ ఎప్పటికో కలిసిపోతారు. ఇలా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ ఉంటుంది జస్టిన్‌ – సెలెనా లవ్‌స్టోరీ. ఈమధ్యే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకొని చక్కగా కనిపించారు. సెలెనా, జస్టిన్‌ కోసం తన తల్లితో కూడా గొడవ పడి బయటకొచ్చింది. ఇంత జరిగాక ఇంక ఈ లవ్‌స్టోరీ సక్సెస్‌ఫుల్‌ అవుతుంది అనుకుంటే, చిన్న ట్విస్ట్‌ వచ్చింది. ఆ ట్విస్ట్‌ పేరే బాస్కిన్‌ చాంపియన్‌.

జస్టిన్‌ గత కొద్దికాలం క్రితం ప్రేమించిన అమ్మాయే బాస్కిన్‌. సెలెనా తిరిగొచ్చేశాక బాస్కిన్‌తో తెగతెంపులు చేసుకున్నాడు జస్టిన్‌. కాకపోతే ఇప్పుడు జస్టిన్, బాస్కిన్‌ ఎలా దగ్గరయ్యారో మళ్లీ దగ్గరయ్యారు. ఈ విషయం సెలెనాకు నచ్చలేదు. జస్టిన్‌ను వదిలేసి పోయింది. దీంతో ఎనిమిదేళ్ల ప్రేమకథ ఇప్పుడు ఇక్కడికొచ్చి ఆగింది. ఇదిక్కడే పూర్తిగా ఆగిపోతుందా? చూడాలి!! ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం జస్టిన్‌ ఎప్పుడెలా ప్రవర్తిస్తున్నాడో అతనికే అర్థం కావట్లేదు పాపం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా