తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయి సినిమా!

22 Dec, 2014 23:07 IST|Sakshi
తక్కువ ఖర్చుతో పెద్ద స్థాయి సినిమా!

 ‘‘ ‘తురుం’ సినిమా కోసం సంగకుమార్ ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. తక్కువ ఖర్చుతో పెద్ద సినిమా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించి, చాలామందికి ఆదర్శంగా నిలిచాడు’’ అని తెలంగాణ శాసన సభ్యుడు ‘రసమయి’ బాలకిషన్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన ‘తురుం’ చిత్రం ఇటీవలే విడు దలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ దర్శకుల సంఘం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బాలకిషన్ మాట్లాడారు. తెలంగాణ సినిమాను అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అల్లాణి శ్రీధర్ చెప్పారు. చిత్ర బృందంతో పాటు తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి అమరేశ్‌కుమార్, మురళి, ప్రేమ్‌రాజ్ మాట్లాడారు.