క‌ల‌లు నాశ‌నం అంటూ న‌టి ఆత్మ‌హ‌త్య‌

26 May, 2020 19:02 IST|Sakshi

ఇండోర్‌: బుల్లితెర న‌టి ప్రేక్ష మెహ‌తా(25) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సోమ‌వారం రాత్రి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో త‌న నివాసంలో ఉరేసుకుని మ‌ర‌ణించింది. అయితే ఆమె కుటుంబ‌స‌భ్యులు నేడు ఉద‌యం గ‌మ‌నించ‌డంతో ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఆమె మ‌రణించింద‌ని వైద్యులు దృవీక‌రించారు. కాగా ఆమె మ‌ర‌ణిండానికి కొన్ని క్ష‌ణాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న జీవితం గురించి పోస్ట్ పంచుకుంది. "మీ క‌ల‌లు నాశ‌న‌మైనపుడు దానంత‌ ద‌రిద్రం మ‌రొక‌టి ఉండ‌దు" అని ఆమె అందులో పేర్కొంది. (ఆర్థిక ఇబ్బందులతో న‌టుడి ఆత్మ‌హ‌త్య‌)

నాలుగు రోజుల క్రితం ఓ సెల్ఫీ ఫొటోను చివ‌రిసా‌రిగా అభిమానుల‌తో పంచుకుంది. ప్రేక్ష మెహ‌తా క్రైమ్ పెట్రోల్‌, లాల్ ఇష్క్, మేరీ దుర్గా వంటి ప‌లు కార్య‌క్ర‌మాల్లో న‌టించింది. ఇటు టీవీ ప్రేక్ష‌కుల‌నే కాకుండా అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన ప్యాడ్ మాన్‌లోనూ త‌ళుక్కున మెరిసి సినీ ప్రేక్ష‌కుల‌నూ అల‌రించింది. లాక్‌డౌన్ వ‌ల్ల భ‌విష్య‌త్తు మీద భ‌యంతోనే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండ‌వ‌చ్చని  ప్రేక్ష బంధువులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల‌‌ ఆర్థిక స‌మ‌స్య‌లు తీవ్ర‌త‌ర‌మై టీవీ న‌టుడు మ‌న్మీత్ గ్రీవ‌ల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. మార్చి 19న టీవీ, చిత్ర షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డ‌గా అనేక మంది న‌టులు, టెక్నీషియ‌న్ల భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డింది. (భార్యను కొట్టిన నటుడు అరెస్ట్‌)

Meri Taraf Aata Har Gham Phisal Jaaye Aankhon Mein Tum Ko Bharun Bin Bole Baatein Tumse Karun 🥰

A post shared by Preksha Mehta 🎭 (@iamprekshamehta) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా