అదో గొప్ప అనుభూతి

24 May, 2014 22:58 IST|Sakshi
అదో గొప్ప అనుభూతి

 బుల్లితెరపై నటించడం గొప్ప అనుభూతి అని వర్ధమాన నటుడు రోహిత్‌రాయ్ పేర్కొన్నాడు. అవి తనకు కొత్త అనుభవాన్ని ఇస్తున్నాయన్నాడు. ఈ మాధ్యమం వల్ల మంచి ఆదాయం కూడా వస్తుందని టీవీతోపాటు కొన్ని సినిమాల్లో నటించిన రోహిత్ తన మనసులో మాట బయటపెట్టాడు. ‘స్వాభిమాన్’ ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమంద్వారా తన కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్... ‘ఝలక్ దిఖ్ లాజా’ అనే డ్యాన్స్ రియాలిటీ షోకి నిర్వాహకుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం ‘ఎన్‌కౌంటర్’ అనే క్రైమ్ సీరియల్‌లో ఇన్‌స్పెక ్టర్ మిలింద్ మాండ్లిక్ పాత్రను పోషిస్తున్నాడు. 2000వ సంవత్సరంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమానికి అమితాబ్ నిర్వాహకుడిగా వ్యవహరించిన అనంతరం అనేకమంది సెలబ్రిటీలు ఆయన బాటపట్టారు.
 
 ఇటువంటి వారిలో షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్, శిల్పాశెట్టి, మాధురి దీక్షిత్, కరణ్ జోహార్, కరిష్మా కపూర్, అక్షయ్‌కుమార్‌లతోపాటు అనిల్‌కపూర్‌కూడా ఉన్నారు. బాలీవుడ్‌లో స్టార్‌డం సాధించిన తర్వాత కూడా వీరంతా బుల్లితెరపైనా తమదైన శైలిలో రాణించారు. ఈ విషయమై రోహిత్ మాట్లాడుతూ ‘టీవీ షోలు నటులకు గొప్ప అనుభూతినిస్తాయి. పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. టీవీ షోల వల్ల రాబడికూడా భారీగానే వస్తుంది. కేబీసీ గత పది సంవత ్సరాలుగా నడుస్తూనే ఉంది. ఈ షోని ప్రజలు మెచ్చుకున్నారు. దీంతోపాటు బిగ్ బాస్, సరిగమపా, ఇండియన్ ఐడాల్ తదితర షోలు కూడా హిట్ అయ్యాయి. టీవీకి అపారమైన శక్తి కలిగిన మాధ్యమం’ అని అన్నాడు.