ట్వింకిల్‌ చెవులకు.. అక్షయ్‌ అరుదైన గిఫ్ట్‌

21 Dec, 2019 17:15 IST|Sakshi

సాక్షి, ముంబై : భర్త ఇచ్చిన ప్రియమైన కానుకను ఆమె ధరించింది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన భార్య ట్వింకిల్‌ ఖన్నాకు ప్రేమతో ఉల్లిపాయలతో చేసిన ఇయర్‌ రింగ్స్‌ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ట్వింకిల్‌ ఖన్నా ఆ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకున్నారు. అంతేకాకుండా తన చెవులకు ఆ ఆనియన్‌ ఇయర్‌ రింగ్స్‌ పెట్టుకుని ఉన్న ఫోటోను ఆమె షేర్‌ చేశారు. ఇయర్‌ రింగ్స్‌ ఒక షూట్‌ నుంచి మరొక షూట్‌ వరకూ ఎలా ప్రయాణించాయో కదా అని ట్వింకిల్‌ వ్యాఖ్యానించారు. అయితే  కొంతమంది నెటిజన్లు వావ్‌ అంటూ అభినందించగా, మరికొందరు అబ్బే బాగోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా అక్షయ్‌ కుమార్‌, కరీనా కపూర్‌, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్‌న్యూస్‌ మూవీ ప్రమోషన్‌ కోసం అక్షయ్‌ ఇటీవల కపిల్‌ శర్మ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆ షో నుంచి అక్షయ్‌ ఉల్లిపాయలతో చేసిన చెవి రింగులను తెచ్చి ట్వింకిల్‌కు అందించగా ...ఆమె వాటిని సంతోషంగా స్వీకరించారు. తనకు అక్షయ్‌ నుంచి మంచి బహుమతి లభించిందని.... కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు