25 Nov, 2017 12:03 IST|Sakshi

సాక్షి, సినిమా :  బాలీవుడ్‌ నటి మహీరా ఖాన్‌కు సొంత దేశం పాక్‌లోనూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇష్టం లేకపోతే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెకు పలువురు సలహా ఇస్తున్నారు. అందుకు కారణం తన తాజా చిత్రం వెర్నా పై ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన ఓ పోస్టు.

సినిమా ప్రారంభంలో ప్రదర్శించే డిస్‌క్లెయిమర్‌(అంతా కల్పితం.. తాము బాధ్యులము కాదంటూ ప్రదర్శించటం) ను పోస్ట్‌ చేసిన మహీరా ‘‘ఈ చిత్రంలో ప్రతీది కల్పితమే. అంటే నిజాన్ని నిగ్గుగా చెప్పలేక పోవటమే. ఈ చిత్రంలోని సన్నివేశాలు కూడా ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల మాదిరిగానే హస్యాస్పదంగా ఉన్నాయి’’ అంటూ పోస్ట్‌ చేసింది. దీనికి కొందరు ఘాటుగా స్పందించారు. ఈ దేశంలో నిబంధనలు ఇలాగే ఉంటాయి. ఇతర దేశాల్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులే ఉన్నాయ్‌. ఇష్టంలేకపోతే పాక్‌ను విడిచి వెళ్లిపోవాలంటూ ఆమెకు సలహా ఇస్తున్నారు. మరికొందరు ఇంకోసారి ఇలాంటివి పోస్ట్‌ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

కాగా, గవర్నర్‌ కొడుకు ఓ యువతిని అత్యాచారం చేయటం అన్న నేపథ్యంతో వెర్నా చిత్రం రూపుదిద్దుకోగా.. అందులో న్యాయపోరాటం చేసే బాధితురాలిగా మహీరా నటించింది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి చిక్కులు ఎదురుకావటంతో వివాదాస్పదంగా కాగా.. చివరకు అభ్యంతరకర సన్నివేశాల తొలగింపు మేరకు చిత్రానికి సర్టిఫికెట్‌ జారీ చేయటంతో విడుదల అయ్యింది. ప్రస్తుతం మిక్స్‌డ్‌ టాక్‌ తో వెర్నా అక్కడ ప్రదర్శితమౌతోంది.

The disclaimer before #verna starts 🎬

A post shared by Mahira Khan (@mahirahkhan) on

మరిన్ని వార్తలు