నలభై ఏళ్ల వయసులోనూ పిల్లల్ని కనొచ్చు!

9 Aug, 2015 04:03 IST|Sakshi
నలభై ఏళ్ల వయసులోనూ పిల్లల్ని కనొచ్చు!

 పెళ్లయ్యేంతవరకూ పెళ్లెప్పుడు? అని అడుగుతుంటారు. పెళ్లయ్యాక.. పిల్లలు ఎప్పుడని  అడుగుతుంటారు. ఈ ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సైఫ్ అలీఖాన్‌ని పెళ్లి చేసుకోవడం ద్వారా కరీనా కపూర్ సమాధానం చెప్పేశారు. ఇప్పుడు పిల్లలకు సంబంధించిన ప్రశ్న ఆమెను వెంటాడుతోంది. ఇటీవల ఓ విలేకరి ఆమెను ఈ విషయం గురించి అడిగితే - ‘‘మరో రెండేళ్లల్లో అమ్మనవుతా’’ అన్నారు. మరి.. వయసు సంగతేంటి? అని ఆ జర్నలిస్ట్ అడిగితే - ‘‘మొదట్నుంచీ ఎప్పుడు ఏది చేయాలనే విషయం మీద నాకో ప్రణాళిక ఉంటుంది. అలాగే, నచ్చినప్పుడు చేయడం అలవాటు. స్టార్ హీరోయిన్ కావాలనుకున్నా.
 
 అయ్యాను. పెళ్లి చేసుకోవాలనుకున్నా.. చేసుకున్నాను. నాకెప్పుడు అనిపిస్తే అప్పుడు అమ్మ అవుతా. ఆ మాటకొస్తే మరో రెండేళ్ల వరకూ తల్లి కావాలని అనుకోవడంలేదు. నలభై ఏళ్ల వయసులో కూడా పిల్లల్ని కనొచ్చు కదా. కంగారెందుకు?’’ అని కొంచెం ఘాటుగానే స్పందించారు. ఇటు మీడియా అనే కాకుండా కరీనాకి కావల్సినవాళ్లు కూడా పిల్లల గురించి అడుగుతున్నారట. ఆ ప్రశ్నకు విసుగు చెందే కరీనా ఇలా స్పందించి ఉంటారని ఊహించవచ్చు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి