ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో...

11 Dec, 2018 03:26 IST|Sakshi
లహరి, కొవెర, శ్రీవిష్ణు

‘‘యు’ చిత్రదర్శకుడు, హీరో కొవెర అసలు పేరు రాజేంద్ర. నేను, తను కలిసి ఇంటర్‌ చదువుకున్నాం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాతో చాలా విషయాలు డిస్కస్‌ చేసేవాడు. తన సినిమాలో సెన్సిబుల్‌ పాయింట్‌ ఉంటుందనే నమ్మకం ఉంది. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ, రాజేంద్ర తొలి సినిమాతోనే ఆ ప్రయత్నం చేయడం గొప్ప విషయం’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. కొవెర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’.

‘కథే హీరో’ అన్నది ట్యాగ్‌ లైన్‌. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. నాగానిక సమర్పణలో విజయలక్ష్మి కొండా నిర్మించారు. సత్య మహావీర్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను శ్రీవిష్ణు విడుదల చేశారు. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్, అఖిల్, శ్రీవిష్ణు.. ఇలా అందరికీ కథలు చెప్పాను. ఓ డైరెక్టర్‌ హీరోను ఎలా ఒప్పిస్తాడు? అనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ సినిమా. కథ బావుంటే డైరెక్షన్‌ అవకాశం ఇచ్చేయరు. ఎందుకంటే.. మనల్ని నమ్మి ఓ వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడు.. ఆ రిస్క్‌ డైరెక్టర్‌ భరిస్తాడా? లేదా? అనే కోణంలో నిర్మాతలు ఆలోచిస్తారు.

రాజమౌళిగారే 400 కోట్ల రూపాయల సినిమా ఎందుకు చేయగలిగారు. ఆ రిస్క్‌ను తీసుకున్నారు కాబట్టి పెద్ద బడ్జెట్‌ మూవీ చేశారు. అందుకే నేనూ రిస్క్‌ తీసుకుని హీరోగా నటించి, దర్శకత్వం చేసి, ఈ సినిమా నిర్మించా. ఎక్కువ రిస్క్‌ తీసుకున్నాను కాబట్టే ఎక్కువ కష్టపడ్డానని గర్వంగా చెప్పుకోగలను. ఇప్పటి వరకూ ఎవరూ టచ్‌ చేయని పాయింట్స్‌ని మా సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత ‘డార్లింగ్‌’ స్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు