శంకర్‌ ఇన్‌స్పిరేషన్‌తో...

16 Dec, 2018 01:39 IST|Sakshi
కొవెర

కొవెర, హిమాన్షి కాట్రగడ్డ జంటగా నటించిన  చిత్రం ‘యూ’, కథే హీరో అనేది ట్యాగ్‌లైన్‌. శ్రీమతి నాగానిక సమర్పణలో కొవెర క్రియేషన్స్‌ బ్యానర్‌పై విజయలక్ష్మీ కొండా నిర్మించారు. కొవెర హీరోగా, దర్శకునిగా చేసిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముత్యాల రాందాస్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను విడుదల చేయాలంటే మినిమమ్‌ పది లక్షల రూపాయలు కావాలి. సినిమా కాన్సెప్ట్‌ బాగా లేకపోతే ఆ డబ్బులు కూడా తిరిగి రావటం లేదు.

మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘యూ’. ట్రైలర్, టైటిల్‌ బావుంది’’ అన్నారు. చిత్ర హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్‌ శంకర్‌ గారి ఇన్‌స్పిరేషన్‌తో ఇలాంటి డిఫరెంట్‌ సినిమాను చేశాను. అవినీతి, అక్రమాల వల్ల జరిగే అనర్థాలను సందేశాత్మకంగా తెరకెక్కించాను. వంద కోట్ల సినిమాను కోటి రూపాయలతో తెరకెక్కించాను. ఇలాంటి ఆలోచనతో కూడా సినిమాలు చేయొచ్చా అనేంత గొప్పగా సినిమా ఉంటుంది’’ అన్నారు. బాలాజీ నాగలింగం, స్క్రీన్‌ప్లే రైటర్‌ మధు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు