2 Jul, 2018 15:52 IST|Sakshi

ఫన్నీ అనుభవాన్ని షేర్‌ చేసుకున్న నటుడు

ముంబై : బాలీవుడ్‌లో నటీనటులు, దర్శకులు-నిర్మాతల, ఇతర యూనిట్‌ మధ్య మంచి సంబంధాలు ఉంటాయన్నది తెలిసిందే. అయితే కొన్నేళ్ల కిందట జరిగిన ఓ సన్నివేశాన్ని నటుడు ఉదయ్‌ చోప్రా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం నటుడి పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 

కొరియోగ్రాఫర్‌గా పేరుతెచ్చుకున్న తర్వాత దర్శకత్వ శాఖలోనూ భారీ సినిమాలు తీశారు ఫరా ఖాన్‌. అమెను ఓ ఏడాది దీపావళి పార్టీలో భాగంగా అనుకోకుండా కలిశాను. అది ఎలా అంటే.. ఆరోజు ఇంట్లో నేను నా గదిలోకి వెళ్లి చూసేసరికి బెడ్‌మీద ఓ యువతి నిద్రిస్తున్నట్లు గుర్తించాను. వెంటనే మెట్లు దిగుతూ కిందకి పరుగులు తీశాను. నా గదిలో ఎవరో అమ్మాయి ఉందని చెప్పేసరికి.. అంతా ఆమె ఫరా ఖాన్‌ అని ఒక్కసారిగా అన్నారు. నువ్వు నా బెడ్‌ అక్రమించుకున్నా నిన్ను ప్రేమిస్తున్నాను ఫరా’ అంటూ ఉదయ్‌ చోప్రా ట్వీట్‌ చేశారు.

ఫరా ఖాన్‌ కూడా ఉదయ్‌ ట్వీట్‌పై అంతే ఫన్నీగా స్పందించారు. ఉదయ్‌ అది నేను కాదు. మీనాక్షి శేషాద్రి. నేను ఆది రూములో నిద్రపోయాను. ఐ లవ్‌ యూ టూ’అని ఫరా పోస్ట్‌ చేశారు. ‘అవును అది ఆది బెడ్‌ అని నాకు తెలుసు. కానీ మాకు ప్రత్యేక గదులు లేవు. ఇద్దరం ఒకే రూములో ఉన్నామని’ ఉదయ్‌ మరో ట్వీట్‌ చేశాడు. ఓహ్‌.. అయితే మా ఇద్దరిలో నిన్ను ఎవరు అంతగా భయపెట్టారో నాకు తెలియదు. నేనా.. లేక మీనాక్షినా. సమాధానం చెప్పవద్దు ప్లీజ్‌’ అని ఫరా మరో రీట్వీట్‌ చేశారు. వీళ్ల మరిచిపోలేని జ్ఞాపకాలు ఫ్యాన్స్‌కు చాలా ఆనందాన్ని పంచుతున్నాయి.

మరిన్ని వార్తలు