ఉద్ఘర్ష మంచి అనుభూతిని కలిగిస్తుంది

8 Mar, 2019 03:53 IST|Sakshi
ఠాకూర్‌ అనూప్‌ సింగ్, దేవరాజ్, సునీల్‌ కుమార్, దర్శన్, మంజునాథ్‌

– ఠాకుర్‌ అనూప్‌ సింగ్‌

కన్నడ పరిశ్రమలో వినూత్న సినిమాలతో పేరు పొందారు దర్శకుడు సునీల్‌ కుమార్‌ దేశాయ్‌. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఉద్ఘర్ష’. అనూప్‌ సింగ్‌ ఠాకూర్, తాన్యా హోప్, ధన్సిక, శ్రద్ధా కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. దేవరాజ్‌ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ మర్డర్‌ మిస్టరీ ట్రైలర్‌ లాంచ్‌ బెంగళూర్‌లో జరిగింది. ‘కిచ్చ’ సుదీప్‌ వాయిస్‌ ఓవర్‌ అందించిన ఈ ట్రైలర్‌ను కన్నడ చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్, నటి ప్రేమ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనూప్‌ సింగ్‌ మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌లో మోస్ట్‌ చాలెంజింగ్‌ పాత్ర ఇది. సినిమా చేయడంలో కొంచెం ఆలస్యం అయింది.

అయినా ఎక్కడా నా కాన్ఫిడెన్స్‌ కోల్పోకుండా చూసుకున్నారు దర్శకుడు దేశాయ్‌. ఆయన సినిమాలో పని చేయడం గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. గొప్ప థ్రిల్లర్‌ను చూశారన్న అనుభూతిని పొందుతారు’’ అన్నారు. ‘‘సునీల్‌గారి సినిమా అనగానే ఓకే అన్నాను. సునీల్‌కుమార్‌గారితో ఆల్రెడీ ‘రే’ అనే సినిమా చేశాను. ఇందులో నా క్యారెక్టర్‌ ఏంటో చెప్పకూడదు. సస్పెన్స్‌. కానీ కచ్చితంగా షాక్‌ అవుతారు’’ అన్నారు హర్షిక పొన్నాడ ‘‘కన్నడ నేర్చుకొని మరీ డబ్బింగ్‌ చెప్పాడు ఠాకూర్‌. తనని అభినందించి తీరాలి’’ అన్నారు దర్శన్‌. ‘‘వాయిస్‌ ఓవర్‌ అందించిన సుదీప్‌కు థ్యాంక్స్‌. టీమ్‌ అందరూ కష్టపడ్డాం. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సునీల్‌కుమార్‌ దేశాయ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!