నా సినీ జీవితంలో ఓ మైలురాయి ఉళ్‌కుత్తు

4 Sep, 2016 01:42 IST|Sakshi
నా సినీ జీవితంలో ఓ మైలురాయి ఉళ్‌కుత్తు

తన సినీ జీవితంలో ఉళ్‌కుత్తు చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని ఆ చిత్ర కథానాయకుడు దినేశ్ వ్యక్తం చేశా రు. ఇంతకు ముందు తిరుడన్ పోలీస్, ఒరునాళ్‌కూత్తు వం టి విజయ వంతమైన చిత్రాలను నిర్మించిన కెనన్య ఫిలింస్ అధినేత జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న మూడో చిత్రం ఉళ్‌కుత్తు. జి.విఠల్‌కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. దినేశ్, నందిత జంటగా నటిస్తున్న ఆ చిత్రంలో శ్రీమాన్, బాలశరవణన్, శాయాసింగ్, ముత్తురామన్, చెఫ్ దామోదరన్ ము ఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
 ఐస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గీతాలు, ప్రచార చిత్రం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర కథానాయకుడు దినేశ్ మాట్లాడుతూ ఉళ్‌కుత్తు తన సినీ జీవితంలోనే కాకుండా నటి నందిత సినీ జీవితంలోనూ ఒక మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉందన్నారు. చిత్రం లోని ప్రతి సన్నివేశాన్ని అంత అద్భుతంగా దర్శకుడు కార్తీక్‌రాజా తెరపై ఆవిష్కరించారని తెలిపారు.
 
 చిత్ర నిర్మాత జే.సెల్వకుమార్ మాట్లాడుతూ ఇది మత్స్యకారుల జీవిత ఇతివృత్తం కాదని, మార్కెట్‌లో చేపలను కోసే వారి నేపథ్యంలో రూపొం దించిన చిత్రం అని వివరించారు. అలా చేపలను కోసే వారిలో ఒకడైన కథానాయకుడి అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఉళ్‌కుత్తు చిత్రం అని తెలిపారు. నటి నందిత, శ్రీమాన్, దర్శకుడు కార్తీక్‌రాజా పాల్గొని