ప్రేమతోనే సమస్య

7 Nov, 2019 01:07 IST|Sakshi
జై రాయరాల, నటరాజ్, గురురాజ్, సురేందర్‌ రెడ్డి, సత్యప్రకాశ్‌

నటరాజ్, నూరిన్, అంకిత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. సత్యప్రకాశ్‌ దర్శకత్వంలో ఎ. గురురాజ్‌ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘అసలు నాకు నీతో కాదు.. ఆ ప్రేమతోనే ప్రాబ్లమ్, ఈ ప్రేమలూ ప్రేతాత్మలు నాకు అస్సల్‌ నచ్చవ్‌’, ‘నిన్ను అంత ఈజీగా వదులుకుంటానా?’ అనే డైలాగ్స్‌తో సాగే ఈ టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సత్యప్రకాశ్‌తో నా అసోసియేషన్‌ మూడు చిత్రాలే అయినప్పటికీ ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తారు. మంచి నటుడు.

ఇప్పుడు ఆయనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తన కొడుకు  హీరోగా ఈ సినిమా చేయడం అభినందనీయం. ఈ చిత్రం విజయం సాధించాలి. నిర్మాత గురురాజ్‌ భవిష్యత్‌లో ఇంకా ఎన్నో పెద్ద చిత్రాలను నిర్మించాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు సత్యప్రకాశ్‌. ‘‘నటరాజ్‌ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. జై రాయరాల మంచి సంగీతం ఇచ్చారు. త్వరలో ట్రైలర్, పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు గురురాజ్‌. ‘‘టీజర్‌ను విడుదల చేసిన సురేందర్‌రెడ్డిగారికి థ్యాంక్స్‌. మా నాన్న సత్యప్రకాశ్, గురురాజ్‌ ఈ సినిమాకు రెండు కళ్లులాంటివారు’’ అన్నారు నటరాజ్‌. జై రాయరాల మాట్లాడారు.

మరిన్ని వార్తలు