‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’

25 Dec, 2019 18:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ పేరేంటి  కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇది కొత్త తెలుగు సినిమా టైటిల్‌. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. ‘c/o కంచరపాలెం’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్‌ మహ ఈ సినిమాకు దర్శకుడు. బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. 2016లో విడుదలై ఘన విజయం సాధించిన మలయాళం​ సినిమా ‘మహేశింతే ప్రతీకారం’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాను 2020, ఏప్రిల్‌ 17న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక వీడియోను విడుదల చేసింది. సత్యదేవ్‌తో పాటు సీనియర్‌ నటుడు నరేశ్‌ ఇందులో కనిపించారు. ‘చెప్పు లేసుకోవయ్యా అంటే.. తిరిగి ఆణ్ణి కొట్టేవరకు చెప్పులు వేసుకోను’  అంటూ హీరో సమాధానం ఇస్తాడు. ప్రతీకారం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. విలక్షణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు