‘రొమాంటిక్‌’ సినిమా నుంచి మరో అప్‌డేట్‌

20 Dec, 2019 13:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ హీరోగా నటిస్తున్న ‘రొమాంటిక్‌’ . ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమాలో ఆకాశ్‌ సరసన ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్‌డేట్‌ను మేకర్‌ అనౌన్స్‌ చేశారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ‘రొమాంటిక్‌’ సినిమాలోని ఫస్ట్‌ వీడియో సాంగ్‌ ‘నువ్వు నేను ఈ క్షణం’  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆకాశ్‌-కేతికల మధ్య ఈ పాట తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని కేతిక ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

‘ఆంధ్రాపోరి’ సినిమాతో అరంగేట్రం చేసిన ఆకాశ్ పూరి.. తండ్రి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘మెహబూబా’ సినిమాలో నటించాడు. కానీ ఈ రెండు సినిమాలు ఆకాశ్‌కు మంచి హిట్‌ను ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఆకాశ్‌ ఉన్నాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథే అందిస్తున్నారు. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.

మరిన్ని వార్తలు