అందుకే ఎన్నికలకు దూరం: ఉపేంద్ర 

25 Nov, 2019 09:02 IST|Sakshi

సాక్షి బెంగళూరు: సినిమాల్లో బిజీగా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కావడం లేదని నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర తెలిపారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ) నుంచి పోటీ చేసే అభ్యర్థులను పరిచయం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉండిందని, కానీ కొన్ని సినిమాలతో తీరిక లేకుండా ఉండడం వల్ల పోటీ చేయలేకపోయాయని తెలిపారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నానని, అందుకే ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై కచ్చితంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రస్తుత రాజకీయాలపై తానేమీ మాట్లాడబోనని, ఆ విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు