కబ్జా చేస్తా

5 Nov, 2019 03:15 IST|Sakshi
ఉపేంద్ర

అండర్‌ వరల్డ్‌ మాఫియా మొత్తాన్ని కబ్జా చేస్తానంటున్నారు ఉపేంద్ర. అందుకోసం కత్తి పట్టుకొని రెడీ అయిపోయారు కూడా. కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర కొత్త చిత్రం పేరు ‘కబ్జా’. 1980లో అండర్‌ వరల్డ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ ఉంటుందట. ఆర్‌. చంద్రు ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు