వర్మ జీఎస్టీ @ 150

25 Jan, 2018 09:47 IST|Sakshi

వివాదాల దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తాజా వివాదం.. జీఎస్టీ అలియాస్‌ గాడ్‌ సెక్స్‌ ట్రూత్‌! పోర్న్‌స్టార్‌ మియా మల్కోవాతో తెరకెక్కించిన ఈ వీడియో చుట్టూ ఇప్పటికే అనేక వివాదాలు ముసురుకున్నాయి. ఇందులో మియాను పూర్తి నగ్నంగా, పవిత్రంగా చూపించానని, ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. వర్మ జీఎస్టీపై మహిళా సంఘాలు తీవ్రంగా మండితున్న సంగతి తెలిసిందే.

వివాదాలు, టీవీ చర్చలు, మియా మల్కోవా టీజర్‌, రాంగోపాల్‌ వర్మ వీడియో కామెంట్ల నేపథ్యంలో ఇప్పటికే జీఎస్టీకి ఫుల్‌ పబ్లిసిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను చూడాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట. ఈ విషయాన్ని రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో వెల్లడించారు. జీఎస్టీని నిర్మించిన అమెరికా కంపెనీ స్ట్రయిక్‌ఫోర్స్‌ ఈ వీడియోను తిలకించేందుకు చార్జీలు వసూలు చేస్తుందని వర్మ తెలిపారు. గాడ్‌సెక్స్‌ట్రూత్‌.ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో ఈ వీడియోను విడుదల చేస్తామని, ఈ వీడియోను చూడాలంటే అమెరికా, కెనడాలో 2.99 డాలర్లు, యూరప్‌లో 1.99 పౌండ్లు, భారత్‌లో రూ. 150, శ్రీలంకలో రూ. 200 చెల్లించాల్సి ఉంటుందంటూ నిర్మాణ కంపెనీ చేసిన ట్వీట్‌ను వర్మ రీట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు