అమితాబ్‌కు అమెరికా కోర్టు సమన్లు

26 Feb, 2015 02:27 IST|Sakshi
అమితాబ్‌కు అమెరికా కోర్టు సమన్లు

వాషింగ్టన్: మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి నమోదైన కేసులో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఫెడరల్ కోర్టు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు సమన్లు జారీచేసింది. అమితాబ్ హాలీవుడ్ మేనేజర్ డేవిడ్ ఏ అంగర్‌కు సమన్ల ప్రతి సోమవారం అందినట్లు సిక్కు హక్కుల సంస్థ తెలిపింది. 1984లో బ్లడ్ ఫర్ బ్లడ్ అనే నినాదాలు చేసి అమితాబ్ సిక్కులకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో న్యూయార్క్‌కు చెందిన సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జె) సంస్థ ఆయనపై కేసు నమోదు చేసింది.