‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’

17 Feb, 2020 18:05 IST|Sakshi

‘సోదాపు.. దమ్ముంటే నన్నాపు’ అంటూ సుధీర్‌ బాబుకు సవాల్‌ విసురుతున్నాడు నాని. నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్‌ బాబులు నటిస్తున్న చిత్రం ‘వి’. అదితిరావు హైదరి, నివేదా థామస్‌ కథానాయికలుగా కనిపిస్తున్న ఈ చిత్రాని​కి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పోలీసు ఆఫిసర్‌గా సుధీర్‌ బాబు.. నెగటీవ్‌ షేడ్స్‌ ఉన్న రాక్షసుడు పాత్రలో నాని కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఈ సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచిన నేపథ్యంలో తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో నాని, సుధీర్‌ల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

(చదవండి : నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్‌ తరుణ్‌?)

‘ పూల్స్‌ మాత్రమే రూల్స్‌ గుట్టిగా ఫాలో అవుతారు సార్‌. అప్పుడప్పుడు నాలాంటోడు కొద్దిగా రూల్స్‌ బ్రేక్‌ చేస్తాడు అంతే’  అంటూ సుధీర్‌ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది.  టీజర్‌ చివర్లో సుధీర్‌ను ఉద్దేశిస్తూ నాని ‘న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడడానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్‌ వేయడానికి నేనేమి నీ ఫ్యాన్‌ కాదురా’,, ‘సోదాపు దమ్ముంటే నన్నాపు’  అని చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా