హంతకుడు వాడేనా?

27 Sep, 2017 02:00 IST|Sakshi

శివ్‌ తాండేల్, నేహా దేశ్‌పాండే జంటగా సాయిసునీల్‌ నిమ్మల దర్శకత్వంలో మణిలాల్‌ మచ్చి అండ్‌ సన్స్‌ నిర్మిస్తున్న సినిమా ‘వాడేనా’. సోమవారం ఈ సినిమా టీజర్‌ను రాజ్‌ కందుకూరి, ఫస్ట్‌ లుక్, చిత్రనిర్మాణ సంస్థ లోగోలను నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, మల్కాపురం శివకుమార్‌లు రిలీజ్‌ చేశారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ– ‘‘కథ బాగుంటే చిన్న సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తాయని ‘పెళ్లి చూపులు, సైరత్, అర్జున్‌రెడ్డి’లతో పాటు పలు సినిమాలు నిరూపించాయి. ప్రజెంట్‌ ట్రెండ్‌కి తగ్గట్టు మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమకథకు యాక్షన్, థ్రిల్లర్‌ అంశాలను మేళవించి, రూపొందించిన చిత్రమిది. ఓ నగరంలో వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను ఓ యువకుడు ఎలా పట్టుకున్నాడనేది చిత్రకథ’’ అన్నారు. చిత్రనిర్మాత మణిలాల్, హీరో హీరోయిన్లు శివ్, నేహా దేశ్‌పాండే పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు