లండన్లో ఎంజాయ్ చేస్తున్న హీరో

10 Apr, 2017 13:32 IST|Sakshi
లండన్లో ఎంజాయ్ చేస్తున్న హీరో

తమిళంతో పాటు తెలుగు తెర మీద కూడా డబ్బింగ్ సినిమాల ద్వారా ఫేమస్ అయిన సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు తన పనులన్నింటినీ కాసేపు పక్కన పెట్టేసి.. ఎంచక్కా తన భార్య, కూతురితో కలిసి లండన్ చెక్కేశాడు. విజయ్ సేతుపతి నటించిన 'పులి' సినిమా విడుదల కావాల్సి ఉంది. జూలై మొదటి వారంలో తిరిగి చెన్నై వస్తాడని భావిస్తున్నారు.

ప్రతియేటా విజయ్ వేసవిలో లండన్ వెళ్తుంటాడని, ఆయన భార్య బంధువులు అక్కడ ఉండటంతో వాళ్ల వద్దకు వెళ్లి చూసి వస్తుంటారని విజయ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అట్లీ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని తమిళ సినిమా షూటింగులో పాల్గొంటారు. జూలై చివరి వారంలో విజయ్ నటించే 59వ సినిమా షూటింగ్ మొదలవుతుంది. చెన్నై బిన్నీ మిల్స్ ప్రాంతంలో ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

>