స్క్రీన్‌ టెస్ట్‌

12 Dec, 2017 00:25 IST|Sakshi

ఈ ఏడాదిలోఇప్పటివరకు రిలీజైనసినిమాల్లోనిపాటలకుసంబంధించినక్విజ్‌ ఇది.ఈ వారంస్పెషల్‌.

► ‘వచ్చిండే పిల్ల మెల్లగ వచ్చిండే.. క్రీము బిస్కెట్‌ ఏసిండే ’ అంటూ చంగు చంగున గంతులేసిన మళయాల కుట్టి ఎవరు?
ఎ) అనుపమా పరమేశ్వరన్‌  బి) అనూ ఇమ్మాన్యుయేల్‌  సి) నివేధా థామస్‌     డి) సాయిపల్లవి

► ‘స్వింగ్‌ జరా’ అనే స్పెషల్‌ పాటలో తన స్వింగ్‌ను 70 యంయం స్క్రీన్‌పై చూపించిన టాప్‌ హీరోయిన్‌ ఎవరు?
ఎ) అనుష్క    బి) తమన్నా భాటియా     సి) కాజల్‌ అగర్వాల్‌  డి) అంజలి

► ‘నీ కళ్ల లోన కాటుక ఓ నల్ల మబ్బు కాదా’ అనే పాటను పాడిన అచ్చ తెలుగు పాటగాడెవరో తెలుసా?
ఎ) రేవంత్‌   బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం       సి) దీపు   డి) హేమచంద్ర

► ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలో‘వాటమ్మా వాటీస్‌ దిసమ్మా’ అనే పాటను పాడింది, సంగీత దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా సంగీత దర్శకుడు?
ఎ) దేవిశ్రీ ప్రసాద్‌    బి) అనూప్‌ రూబెన్స్‌   సి) జిబ్రాన్‌    డి) ఆర్పీ పట్నాయక్‌

► ‘భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి’ అనే పాటను ఆలపించిన ప్రముఖ గాయకుడు?
ఎ) దలేర్‌ మెహందీ    బి) కైలాశ్‌ ఖేర్‌     సి) యాసిన్‌ నిజార్‌      డి) విజయ్‌ ప్రకాశ్‌

► ‘ఓ సక్కనోడా దాడి చేసినావ దడదడ, కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంతకాలం’ అని బాక్సర్‌ రిథికాసింగ్‌ ఏ హీరో వెంటపడుతుంది?
ఎ) నాగార్జున    బి) వెంకటేశ్‌     సి) వరుణ్‌ తేజ్‌         డి) సాయిధరమ్‌ తేజ్‌

► ‘పడమటి కొండల్లో వాలిన సూరీడా’ అనే పాటను పాడింది సింగర్‌ కాలభైరవ. అతను ఏ సంగీత దర్శకుని కుమారుడు?
ఎ) యంయం కీరవాణి   బి) మణిశర్మ    సి) ఇళయరాజ   డి) చక్రవర్తి

► ‘డియో డియో డిసక డిసక’ పాటలో దుమ్ము రేపే స్టెప్పులు వేసిన హాట్‌ గాళ్‌ ఎవరు?
ఎ) రాఖీ సావంత్‌    బి) సన్నీ లియోన్‌    సి) బిపాసా బసు    డి) మలైకా అరోరా

► ‘అడిగా అడిగా’ అని ‘నిన్ను కోరి’సినిమాలోని సూపర్‌హిట్‌ పాటనుపాడిందెవరు? (ఈ పాటను తనేపాడినట్లు నాని ప్రమోషన్‌ సాంగ్‌లోకూడా నటించారు)
ఎ) శ్రీరామచంద్ర    బి) దీపు   సి) ఆల్ఫాన్స్‌ జోసఫ్‌   డి) సిద్‌ శ్రీరామ్‌

►   ‘జోగేంద్ర జోగేంద్ర’ అని  ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో వచ్చే పాటకు సంగీత దర్శకత్వంవహించిందెవరు?
ఎ) కళ్యాణి మాలిక్‌   బి) అనూప్‌ రూబెన్స్‌   సి) యం.యం. శ్రీలేఖ     డి) సాయికార్తీక్‌

► ‘వేయి నామాల వాడ వెంకటేశుడా’ అంటూ ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కృష్ణమ్మ పాత్రను పోషించిన నటి ఎవరు?
ఎ) రెజీనా కసాండ్రా  బి) కేథరిన్‌ థెరిస్సా    సి) అనుష్క శెట్టి         డి) ప్రగ్యా జైస్వాల్‌

► ‘భ్రమరాంభకు నచ్చేశాను’ అనే పాటను నాగచైతన్యఏ హీరోయిన్‌ని ఉధ్దేశించి పాడతాడు?
ఎ) హన్సిక     బి) సమంత    సి) లావణ్య త్రిపాఠి    డి) రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

► ‘నక్షత్రం’ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో నటించిన టాప్‌ హీరోయిన్‌ ఎవరు?
ఎ) రాశీ ఖన్నా    బి) శ్రియ   సి) హెబ్బా పటేల్‌    డి) చార్మీ

► సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ 2017వ సంవత్సరంలో ఎన్ని తెలుగుసినిమాలకు సంగీతం అందించారు?
ఎ) 8    బి) 14    సి) 10    డి) 12

► ‘రాజుగారి గది 2’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?
ఎ) యస్‌.యస్‌. తమన్‌  బి) గోపిసుందర్‌    సి) జిబ్రాన్‌ డి) మహతి

► చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రానికి సంబంధించి పాటల్లో ఏ పాట వివాదం అయింది?
ఎ) నీరు నీరు     బి) రత్తాలు రత్తాలు     సి) అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు     డి) యు అండ్‌ మి

► ‘సిసిలియా సిసిలియా’ అనే పాట‘స్పైడర్‌’ సినిమాలోనిది. ఈ పాటకుసంగీత దర్శకత్వం వహించిన తమిళ సంగీత దర్శకుడెవరు?
ఎ) ఏ.ఆర్‌. రహమాన్‌  బి) హారిస్‌ జయరాజ్‌     సి) ఇళయరాజ     డి) అనిరుద్‌

► ‘గున్న గున్న మామిడి’ అనేపాపులర్‌ ఫోక్‌ సాంగ్‌ను ఏతెలుగు కమర్షియల్‌సినిమాలో వాడారు?
ఎ) నిన్ను కోరి   బి) నేను లోకల్‌      సి) రాజా ది గ్రేట్‌    డి) ఫిదా

► ‘మధురమే ఈ క్షణము’ అనే పాట అర్జున్‌ రెడ్డి సినిమాలోనిది. ఈ పాట రచయిత ఎవరు?
ఎ) చంద్రబోస్‌   బి) రామజోగయ్య శాస్త్రి     సి) శ్రేష్ఠ    డి) శ్రీమణి

► ‘బొమ్మోలెగున్నదిర పోరి బొంబొంబాటుగుందిరా నారి’అనే పాటలో నటించిన హీరో ఎవరు?
ఎ) శర్వానంద్‌     బి) మంచు విష్ణు    సి) నితిన్‌    డి) నాగచైతన్య


మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి  2) బి  3) డి  4) ఎ  5) ఎ  6) బి  7) ఎ  8) బి  9) డి  10) బి  11) సి  12) డి  13) బి  14) సి  15) ఎ  16) సి  17) బి  18) సి  19) సి  20) సి

మరిన్ని వార్తలు