మహిళా కమెడియన్‌కు లైంగిక వేధింపులు

13 Jul, 2020 08:26 IST|Sakshi

ముంబై : ప్రముఖ మహిళా కమెడియన్‌పై సోషల్‌ మీడియాలో లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ వ్యక్తిని ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. ముంబైకు చెందిన స్టాండప్‌ కమెడియన్‌ అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న చత్రపతి శివాజీ విగ్రహం గురించి వీడియో రూపంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది జరిగిన ఏడాదికి కొంతమంది నెటిజన్లు ప్రస్తుతం ఆమెపై విమర్శల దాడికి దిగారు. మరాఠా పాలకుడు చత్రపతి శివాజీని అ​గ్రిమా అగౌరవపరించిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో వడోదరకు చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాను అసభ్య పదజాలంతో దూషించాడు. చత్రపతి శివాజీ గురించి అగ్రిమా మాట్లాడిన వ్యాఖ్యలను ఉద్ధేశిస్తూ ఆమెను లైంగిక వేధింపులతో బెదిరిస్తూ మిశ్రా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోలను పోస్ట్‌ చేశాడు. (కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్‌ ట్వీట్‌)

దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌ నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. మిశ్రా వీడియో సోషల్‌ మీడియాలో వైరలవ్వడంతో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌ పర్సన్‌ రేఖా శర్మా గుజరాత్‌ డీజీపీకి లేఖ రాశారు.  మహిళలకు సోషల్‌ మీడియాలో సురక్షిత వాతావరణాన్ని, సైబర్‌ భద్రతను కల్పించేందుకు ఎన్‌సీడబ్ల్యూ కట్టుబడి ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఇక నిందితుడు మిశ్రాపై వడోదర పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుజరాత్‌ డీజీపీ శివానందర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా కమెడియన్‌ జాషువాపై విమర్శలు వెల్లువెత్తడంతో చత్రపతి శివాజీ అనుచరుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె క్షమపణలు కోరారు. అలాగే దీనికి సంబంధించిన వీడియోను డిలీట్‌ చేశారు. (నటుడు రాజన్‌ సెహగల్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు