చిత్ర నిర్మాణ రంగంలోకి వైగో

11 Oct, 2017 11:41 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన కన్నకీ ఫిలింస్‌ పతాకంపై చారిత్రకారిణి వేలు నాచ్చియార్‌ జీవిత కథను చిత్రంగా నిర్మించనున్నారు. వేలు నాచ్చియార్‌ నాటకం తమిళనాటు ప్రసిద్ధి చెందింది. ఈ నాటకాన్ని సోమవారం సాయంత్రం స్ధానిక మైలాపూర్‌లోని నారదగానసభలో ప్రదర్శిం చారు.

ఈ నాటక ప్రదర్శనకు వైగో, నడిగర్‌సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధక్షుడు విశాల్, నాజర్‌ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.  ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన చరిత్రకారిణి వేలు నాచ్చయార్‌ చరిత్రను చిత్రంగా నిర్మించనున్నానని వెల్ల డించారు.

విశాల్‌ మాట్లాడుతూ తాను ముఖ్యమైన అంశం గురించి ప్రభుత్వంతో చర్చించాల్సి ఉన్నా, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైగో కోరడంతో వచ్చానన్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి పన్ను కట్టడాన్ని ఎదిరించి వేలు నాచ్చియార్‌ పోరాడారని, తాము వినోదపు పన్ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. పన్ను విషయంలో ప్రభుత్వం నుంచి సాధకమైన నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని విశాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు