అదిరిపోయిందిరా బాబు అంటారు

13 Jun, 2019 02:34 IST|Sakshi
నరేంద్ర, అరుణ్‌ పవార్, సప్తగిరి, జీవీఎన్‌ రెడ్డి

– అరుణ్‌ పవార్‌

సప్తగిరి హీరోగా అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘వజ్ర కవచధర గోవింద’. ఇందులో వైభవీ జోషి కథానాయికగా నటించారు. నరేంద్ర యడ్ల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సినిమా పట్ల బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమాపై చాలా పాజిటివ్‌ వైబ్‌ ఉంది. దాదాపు 300 థియేటర్స్‌లో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో ప్రొడ్యూసర్స్‌ దైవస్థానంలో ఉంటారని అంటారు. ఆ స్థానంలో ఉండి మాకు సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు.

హీరోయిన్‌గా వైభవి జోషి బాగా నటించారు. ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలి. అలాగే మా సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన శ్రీకాంత్‌ అన్నకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో కామెడీతోపాటు మంచి ఎమోషన్‌ అంతకు మించిన బలమైన కథ ఉంది. మంచి క్లైమాక్స్‌ కుదిరింది. నిర్మాతలు సపోర్ట్‌ చేశారు. వారికి రెండు రోజుల్లోనే డబ్బులు వస్తాయి. సినిమా చూసిన వారు అదిరిపోయిందిరా బాబు అని అంటారు’’ అన్నారు అరుణ్‌ పవార్‌. ‘‘కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు జీవీఎన్‌ రెడ్డి. హీరోయిన్‌ వైభవి జోషి, నిర్మాత నరేంద్ర, నటులు మంజు, రాజేంద్రన్, రాజేష్, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు