ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం

17 Jun, 2019 02:56 IST|Sakshi
సప్తగిరి,జి.ఎన్‌.రెడ్డి, అర్చన, అరుణ్‌ పవార్‌

– సప్తగిరి

‘‘మా సినిమాకి తొలిరోజు మిక్డ్స్‌ టాక్‌ వచ్చింది. తర్వాత వెంటనే యావరేజ్‌ అన్నారు. చిన్నవాళ్లం.. అందరూ ఆశీర్వదించండి. మరిన్ని సినిమాలు చేసేలా ప్రోత్సహించండి’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరో గా,  వైభవీజోషి కథానాయికగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. అర్చన కీలక పాత్రలో నటించారు. అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో నరేంద్ర, జి.ఎన్‌.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన బడ్జెట్‌ను, మన టార్గెట్‌ను రీచ్‌ అయ్యామని డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్యగారు చెప్పడంతో హ్యాపీ. పరిశ్రమలో నిర్మాతలది దైవస్థానం. మా నిర్మాతలు జి.ఎన్‌.రెడ్డి, నరేంద్రగారికి ధన్యవాదాలు. సెకండాఫ్‌లో 10 నిమిషాలు తగ్గిస్తున్నాం.

ఇక 100 శాతం గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా భారీ హిట్‌ అవ్వాలని మేం కోరుకోలేదు. కానీ మా శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని మాత్రం కోరుకున్నాం.. అది దక్కినందుకు అందరం తృప్తిగా ఉన్నాం. సప్తగిరిలాంటి హీరోను నమ్ముకుంటే కచ్చితంగా 200 కుటుంబాలు బతుకుతాయి’’ అన్నారు నిర్మాత నరేంద్ర. ‘‘వజ్ర కవచధర గోవింద’ సినిమాని 400 థియేటర్లలో విడుదల చేశాం. 2 రోజులకు రూ.90లక్షల గ్రాస్‌ వసూలు చేసింది’’ అన్నారు బ్రహ్మయ్య. ‘‘కాలేజ్, స్కూల్‌ ఓపెనింగ్‌ టైమ్‌లోనూ మా సినిమా ఇంత బాగా ఆడుతోంది. థియేటర్లలో జనాలు నవ్వుతుంటే ఆనందంగా ఉంది’’ అని అరుణ్‌ పవార్‌ అన్నారు. ‘‘ఈ సినిమాలో నల్లూరి ప్రసన్నలక్ష్మీ అనే ఎమ్మెల్యేపాత్ర చేశాను’’ అన్నారు అర్చన.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం