కథకు తగ్గ టైటిల్‌

11 Mar, 2019 00:40 IST|Sakshi
సప్తగిరి

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వికెజి’. (వజ్రకవచధర గోవింద). అరుణ్‌ పవార్‌ దర్శకత్వం వహించారు. శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 6న సినిమాని విడుదల చేయనున్నారు. అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ మా సినిమాలో ఉంటాయి. తన  బాడీలాంగ్వేజ్‌కు పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది. కథ డిమాండ్‌ మేరకే ‘వజ్రకవచధర గోవింద’ అనే టైటిల్‌ పెట్టాం.

ఫన్నీ దొంగకు, ‘వికెజి’ టైటిల్‌కు సంబంధమేంటనే అంశం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది’’ అన్నారు. నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరుణ్‌ పవార్‌–సప్తగిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా మా ‘వికెజి’ ఉంటుంది. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. వైభవీ జోషీ, అర్చనా వేద, ‘టెంపర్‌’ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్‌ కొట్టోలి, వీరేన్‌ తంబిదొరై తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలాన బాలగోపాలరావు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు