ఫ్రెష్ థాట్‌తో...

14 Feb, 2015 23:17 IST|Sakshi
ఫ్రెష్ థాట్‌తో...

ప్రేమను అందంగా ఆవిష్కరిస్తూ తీసిన  చిత్రం ‘యస్’(అందమైన ప్రేమకథ). అభిరామ్, శ్రుతీరాజ్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దేవాస్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్, శ్రేయాస్ మీడియా సంయుక్త నిర్మాణంలో శ్యామ్‌దేవభక్తుని, జి. శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రజిని తనయ్ దర్శకుడు. ఈ సినిమా  ప్రచార చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా  శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా  దర్శకుడు మారుతి మాట్లాడుతూ-‘‘ఫ్రెష్ థాట్‌తో తీసిన ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు’’ అన్నారు.  ‘‘ఇది ఒక అందమైన ప్రేమకథ. త్వరలోనే విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఇంద్రగంటి, కెమెరా: గొట్టిపాటి సురేశ్.