వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

15 Jul, 2019 00:32 IST|Sakshi
నవీన్‌రాజ్‌ శంకరపుడి, శ్రావ్య

‘‘యాక్టర్‌ అవుదామని వచ్చిన సంజయ్‌ కుమార్‌గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్‌ చనిపోవడంతో సంజయ్‌గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్‌ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో  ‘అల్లరి’ నరేశ్‌  అన్నారు. నవీన్‌రాజ్‌ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్‌.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’. భవాని శంకర ప్రొడక్షన్స్‌ పతాకంపై బి.సంజయ్‌ కుమార్‌ నిర్మించారు.

మోహన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం యాక్టింగ్‌ స్కూల్‌లో పరిచయమయ్యారు నరేశ్‌. ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత తుమ్ముళ్లపల్లి రామసత్యనారాయణ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. సంజయ్‌గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా తీశారు’’ అన్నారు భరత్‌.పి, నరేంద్ర. నిర్మాత రాజ్‌ కందుకూరి పాల్గొన్నారు.
∙ నవీన్,శ్రావ్య

మరిన్ని వార్తలు