ఆ ఇద్దరి బాటలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌

22 Sep, 2017 12:21 IST|Sakshi

తమిళసినిమా:  నయనతార, త్రిష తరహాలో ఫెరోషియస్‌ పోషించడానికి నటి వరలక్షీ శరత్‌కుమార్‌ రెడీ అయ్యింది. తారాతప్పట్టై చిత్రంతోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న వరలక్ష్మీ ఇప్పుడు తమిళంతో పాటు మలయాళం, కన్నడం భాషలోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రను పోషించే అవకాశం వరించింది. దర్శకుడు మిష్కిన్‌ శిష్యుడు ప్రియదర్శిని మెగాఫోన్‌ పట్టనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి  వేళ్లనుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథగా ఉంటుందని చెప్పారు. హీరోయిన్‌గా వరలక్ష్మీశరత్‌కుమార్‌ నటించనున్నారని, ఆమె పాత్ర అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలిపారు.

వరలక్ష్మీ పాత్రకు ఫైట్‌ సన్నివేశాలు భారీగా ఉంటాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌ తరహాలో ఆమె పాత్ర ఉంటుందని అన్నారు. ఇందులో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, పూనె ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది జనరంజకమైన అన్ని కమర్షియల్‌ అంశాలతో రూపొందనున్న చిత్రం అన్నారు. యాక్షన్, మిస్టరీ, రోడ్‌ థ్రిల్లర్‌ చిత్రంగా ఉంటుందని తెలిపారు. దీనికి శ్యామ్‌.సీఎస్‌ సంగీతం, బాలాజీ రంగా ఛాయాగ్రహణం అందించనున్నారు. చిత్రాన్ని అక్టోబర్‌ 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు మిష్కిన్‌ బర్త్‌డే సందర్భంగా బుధవారం విడుదల చేయాలనుకున్నా, అందుకు పనులు పూర్తి కాకపోవడంతో విజయదశమి సందర్భంగా ఈ నెల 30న విడుదల చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిం చనున్నట్లు చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి