సిబిరాజ్‌తో వరలక్ష్మి

12 Dec, 2016 14:51 IST|Sakshi
సిబిరాజ్‌తో వరలక్ష్మి

యువ నటుడు సిబిరాజ్‌తో నటించడానికి వరలక్ష్మి శరత్‌కుమార్ రెడీ అవుతున్నారు. ఈ సంచలన తార వృత్తి పరంగా స్పీడ్ పెంచారు.ఇప్పటి వరకూ స్లో అండ్ స్టడీ పాలసీని అవలంభిస్తూ వచ్చిన వరలక్ష్మి ఇప్పుడు నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నటుడు విశాల్‌కు ఈ అమ్మడికి మధ్య ప్రేమాయణం లాంటిదేదో జరుగుతోందని ఆ మధ్య కథలు కథలుగా ప్రచారం అరుున విషయం తెలిసిందే. అరుుతే ఇటీవల మూడేళ్ల ప్రేమను మేనేజర్‌తో చెప్పించి తుంచేశారని తన ట్విట్టర్‌లో పేర్కొని కలకలం సృష్టించిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ఇటీవల నటుడు శంబుతో కలిసి విందులో పాల్గొని మరోసారి వార్తల్లో కెక్కారు. కాగా శింబుతో కలిసి నటించిన పోడా పోడీ చిత్రం నిర్మాణం పూర్తి అరుున చాలా కాలానికి తెరపైకి వచ్చింది.

అదే ఈ బ్యూటీ తొలి చిత్రం అన్నది గమనార్హం. ఆ తరువాత చాన్నాళ్లకు విశాల్‌కు జంటగా మదగజరాజా చిత్రంలో నటించారు. అరుుతే ఆ చిత్ర విడుదలకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఆ తరువాత బాలా దర్శకత్వంలో నటించిన తారైతప్పటై్ట చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోరుునా వరలక్ష్మి నటనకు మాత్రం ప్రశంసలు లభించారుు. ఆ తరువాత తమిళ చిత్రం ఏదీ విడుదల కాకపోరుునా, కన్నడ, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రంలో నటించి బహుభాషా నటి అనిపించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో నిపుణన్, అమ్మారుు, విక్రమ్ వేదా చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా సిబిరాజ్‌తో మరో చిత్రం చేసే అవకాశం వరించింది.

నటుడు సత్యరాజ్ సమర్పణలో నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రంలో సిబిరాజ్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఇప్పటికే నటి రమ్యానంభీశన్‌ను ఎంపిక చేశారు. మరో ముఖ్య పాత్రలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ నటించనున్నారు. ఇందులో వరలక్ష్మి ఇంతకు ముందు పోషించనటువంటి బలమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. దీనికి సైతాన్ చిత్రం ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా