ఆ సినిమా చూడండి వైరస్‌ వ్యాప్తి అర్ధమవుతుంది

28 Mar, 2020 09:07 IST|Sakshi

సంచలన నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ సమాజానికి సంబంధించిన ఏ విషయంలోనా స్పందించడానికి ముందుంటుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు సహకరించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుంది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు బయటకు రాకుండా ఇంట్లో ఉంటే చాలు. అదే మనకు, చుట్టుపక్కల ఉన్న వారికి  క్షేమం. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.

ఈ అమ్మడు ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అందులో ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఇంట్లోనే ఉంటున్నారని భావిస్తున్నాను. నేనూ ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వైరస్‌ మనకు సోకదు అని కొందరు భావిస్తున్నారు. అయితే, అది కరెక్ట్‌ కాదు. కరోనా ఎవరికైనా సోకవచ్చు. కాంటేజెయన్‌ అనే ఆంగ్లో సినిమా ఉంది. అది చూస్తే ఇలాంటి వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్ధమవుతుంది. కాగా, చుట్టు పక్కల పిల్లలు, వృద్ధులకు సహాయం చేయండి. అలాగే ఇళ్లు, దుకాణాల అద్దెలను ఈ నెల ఆలస్యంగా తీసుకుంటే మంచిది.

ప్రభుత్వం నిత్యావసర వస్తువులను అందరికీ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. అదే విధంగా యువత బయట తిరగకుండా కనీసం నెల రోజుల పాటైనా  ఇంట్లోనే ఉంటే మంచిది. ఇటలీ మాదిరి మన ఇండియా చిన్న దేశం కాదు. 134 కోట్ల మంది జనాభా గల దేశం మనది. కరోనా భారత దేశంలో వ్యాప్తి చెందితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే కొంచెం బుద్ధిని ఉపయోగించండి అని వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ హితవు పలికింది.   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు