ఇండియా కోసం ఇంగ్లాండ్‌కు!

30 Jun, 2019 08:15 IST|Sakshi

ఇండియా కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లారు మన ముద్దుగుమ్మలు. సినిమా రంగం, క్రీడారంగం ఈ రెండే ప్రేక్షకులకు ప్రత్యేకం. సినిమాలను ఎంతగా ఆదరిస్తారో, క్రికెట్‌ క్రీడను అంత ఆసక్తిగా తిలకిస్తారు. దీంతో ఈ రెండు రంగాల్లోని ప్రముఖులను ప్రజలు హీరోలుగానే చూస్తారు. సినిమాలు విజయవంతం అయితే అభిమానులు ఎంతగా పండగ చేసుకుంటారో, క్రికెట్‌ మ్యాచ్‌లో గెలిస్తే అంతకంటే ఎక్కువ సంబరాలు చేసుకుంటారు. అయితే క్రికెట్‌ క్రీడాకారులకు సినీ స్టార్స్‌పై ఎంత అభిమానం ఉంటుందో గానీ, సినీ తారలకు మాత్రం క్రికెట్‌ క్రీడాకారులంటే చాలా క్రేజ్‌.

దీనికి ఉదాహరణే అందాలభామలు త్రిష, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ లాంటివారు భారత క్రికెట్టు ఆటను చూడడానికి, వారిని ఉత్సాహపరచడానికి ఏకంగా ఇంగ్లాడ్‌ దేశానికి ఎగిరిపోయారు. ఇప్పుడు వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ వార్‌ జరుగుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిందిన అవసరం లేదు. మధ్యాహ్నం అయితే జనాలు టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక భాగ్యవంతులైతే ప్రత్యక్షంగా చూడడానికి క్రికెట్‌ జరుగుతున్న స్టేడియంకే వెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు.

కాగా ఇండియా క్రికెట్‌ జట్టు ఇప్పుడు విజయవిహారం చేస్తోంది. ఆరు పోటీల్లో ఐదింటిలో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇంకా మూడు పోటీలు ఉన్నాయి. కాగా మరో పోటీలో గెలిస్తే సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా ఆదివారం ఇండియా జట్టు ఇంగ్లాండ్‌ జట్టుతో ఢీకొనబోతోంది. అయితే ఈ పోటీ ఇరుజట్లకు ముఖ్యమే. ఇండియాను సెమీఫైనల్‌కు చేర్చే పోటీ అయితే, ఇంగ్లాండ్‌ను పోటీలో నిలిపేపోరు.

అవును ఈ పోటీలో గెలవకపోతే ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ అవకాశాలను కోల్పోతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు చాలా ముఖ్యం. దీంతో ఇరు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రీడను ప్రత్యక్షంగా తిలకించడానికి, ఇండియా జట్టును ఎంకరేజ్‌ చేయడానికి నటి త్రిష, వరలక్ష్మీశరత్‌కుమార్, బిందుమాదవి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. దీని గురించి నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు.

మరిన్ని వార్తలు