అంతా అయ్యాక ఫిర్యాదా? 

2 Mar, 2020 10:23 IST|Sakshi

చెన్నై : అంతా అయిన తరువాత ఫిర్యాదు చేయడం అంగీకారం కాదని నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ అంటోంది. కోలీవుడ్‌లో  డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ నటి ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. పోడాపోడీ చిత్రంతో నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ కూతురన్నది తెలిసిందే. కథానాయకిగా పయనాన్ని ప్రారంభించినా, అవకాశాలు రాకో, నటిగా నిరూపించుకోవాలన్న తపనతోనో ప్రతినాయకిగా నటించడానికి కూడా సై అంది. అలా రకరకాల పాత్రలతో కూడిన పలు చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌. ఈమె ప్రేమ వ్యవహారం గురించి చాలానే ప్రచారం జరిగింది. అలా కూడా సంచలన నటిగా ముద్ర వేసుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి పలువురు ప్రముఖ నటీమణులు కథలు కథలుగా వెతలను చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అలాంటి సమస్యను తానూ ఎదుర్కొన్నానని బహిరంగంగానే చెప్పింది.

(చదవండి : ‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’)

అంతేకాదు తనను ఇంటర్వ్యూ చేసిన ఒక టీవీ చానల్‌ విలేకరి అడ్జెస్ట్‌మెంట్‌ కావాలని అడగడంతో అతని చెంప చెళ్లుమనిపించినట్లు చెప్పింది. కాగా కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో తాజాగా మళ్లీ అలాంటి ఆరోపణలు ప్రసారం అవుతుండడంతో దీనిపై నటి వరలక్ష్మీ స్పందిస్తూ మీటూ సమస్యను తానూ ఎదుర్కొన్నానని చెప్పింది. ఒక  నటుడి వారసురాలినని తెలిసి కూడా సినిమా అవకాశం కోసం పడక గదికి రమ్మన్నారని చెప్పింది. దర్శక, నిర్మాతలతో  అడ్జెస్ట్‌ కావాలని కొందరు చెప్పారని తెలిపింది. దీంతో అలాంటి అవకాశం తనకు అవసరం లేదని నిరాకరించినట్లు చెప్పింది. అలా మాట్లాడిన వారి ఆడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పింది. కాగా ఇలాంటి విషయాల్లో అంతా జరిగిన తరువాత ఫిర్యాదు చేయడం అంగీకారం కాదంది. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి తయారవ్వాలని చెప్పింది. కాగా ఈమె మహిళారక్షణ కోసం, సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పోరాడడానికి స్త్రీశక్తి పేరుతో ఒక సమాఖ్యను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు వెల్వెట్‌ నగరం, పాంబన్‌ చేజింగ్, డానీ పిరందాల్‌ పరాశక్తి తమిళ చిత్రాలతో పాటు, తెలుగులో క్రాక్‌ చిత్రం, కన్నడ చిత్రం రణం చిత్రాల్లో నటిస్తోంది. కాగా ఈమె నటించిన కన్నిరాశి, కాటేరి చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి.  

మరిన్ని వార్తలు