నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బే

21 Feb, 2020 08:59 IST|Sakshi

సంచలన హీరోయిన్‌ నయనతారపై వ్యతిరేకత ఎక్కువ అవుతోందా? ఆమెపై చర్యలకు నిర్మాతల సంఘం సిద్ధం అవుతోందా? అసలు ఇంతకీ నయనతార ఎదుర్కొంటున్న ఆరోపణలు ఏమిటి? ఈ విషయాలు చర్చించే ముందు నయనతార స్థాయి ఏమిటో చూద్దాం. అయ్యా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మాలీవుడ్‌ బ్యూటీ నయనతార.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లామరస్‌ ఇమేజ్‌ నుంచి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల నటి స్థాయికి ఎదిగింది. అంతే కాదు దక్షిణాదిలోనే నంబర్‌వన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అలా తన ఇమేజ్‌తో పాటు పారితోషికాన్ని పెంచుకుంటూపోయింది. అది ఎంత అంటే నిర్మాతలకు తడిసి మోపెడు అయ్యేంతగా. నయనతార ప్రస్తుతం రూ.6 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  చదవండి: టీవీ యాంకర్‌ ఇంట్లో పేలిన కుక్కర్‌

ఇది కూడా పర్వాలేదు. ఎందుకంటే నిర్మాతలు అందుకు అంగీకరించే అంత భారీ పారితోషికాన్ని ముట్టజెపుతున్నారు. అయితే దానితో పాటు ఆమె ఇతర అవసరాల ఖర్చులే భారంగా మారాయంటున్నారు. నయనతారకు ప్రత్యేక కేరవాన్, బాడీగార్డ్స్‌ వేతనాలు, ఆమె ప్రత్యేక మేకప్‌మన్, హెయిర్‌డ్రస్సెర్, వ్యక్తిగత అసిస్టెంట్, కారు డ్రైవర్‌ వారందరికీ నిర్మాతనే వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి. వీటికి మాత్రమే రోజుకు రూ. 60 నుంచి 70 వేలు అవుతుంది. ఇవికాక నయనతార సొంత ఖర్చులకు కూడా నిర్మాతలపై మోపుతున్నట్లు, చివరికి తన వెంట వచ్చే ఆమె ప్రియుడు సరదాల ఖర్చు నిర్మాతలే  భరించాల్సివస్తోందనే ఆరోపణలపై నిర్మాతల మండలిలో చర్చ జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఇదే విషయాన్ని ఇటీవల నిర్మాత రాజన్‌ ఒక వేదికపై నటి నయనతార పారితషికం గురించి మాట్లాడారు.

దీంతో ఇకపై నయనతార వంటి స్టార్‌ హీరోయిన్లకు కేరవాన్ల వసతి, ఇతర ఖర్చులను వారి పారితోషికాల నుంచే పెట్టుకోవాలనే నిబంధనను విధించాలని ఒత్తిడి నిర్మాతల మండలిపై పెరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర నటీమణులు దిగ్బ్రాంతికి గురవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా నయనతారకు ఇలాంటి ఆరోపణలు పెద్ద దెబ్బేనంటున్నారు సినీ వర్గాలు. ఇప్పుటికే అవకాశాలు తగ్గాయని, ప్రస్తుతం చేతిలో ఒకటి రెండు చిత్రాలే ఉన్నాయని, కొత్త అవకాశాలు లేకపోవడంతో నిజంగా ఆమెపై వస్తున్న ఆరోపణలపై నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటే కెరీర్‌ ఇంకా  దారుణంగా తయారవుతుందని సినీ వర్గాల మాట. మరి దీని గురించి  నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి.  

మరిన్ని వార్తలు