‘అవి ఫేక్‌ న్యూస్‌.. జీఎస్టీ తొలగించలేదు’

1 Feb, 2018 13:01 IST|Sakshi
వర్మ ‘గాడ్స్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ వర్కింగ్‌ స్టిల్‌

రామ్ గోపాల్‌ వర్మ రూపొందించిన గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ వీడియో ప్రసారాలను భారత్‌లో నిలిపివేసినట్టుగా వస్తున్న వార్తలపై రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ పోలీసుల ఆదేశాలతోనే విమియో చానల్‌ జీఎస్టీ వీడియోను తొలగించినట్టుగా వచ్చిన వార్తలను వర్మ ఖండించారు. అంతేకాదు ప్రస్తుతం విమియోలో వీడియో అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా వెల్లడించారు వర్మ.

‘స్ట్రయిక్‌ ఫోర్స్‌ ఎల్‌ఎల్‌సీ నిర్మాతలు ఫైరసీ వెబ్‌సైట్‌గా భావించి ఫిర్యాదు చేయడంతో కాపీరైట్‌ చర్యల్లో భాగంగా విమియో జీఎస్టీ వీడియోను తొలగించింది. నిర్మాతలకు చెందిన అధికారిక వెబ్‌ సైట్‌లో గాడ్స్ సెక్స్‌ అండ్ ట్రూత్‌ వీడియో యాక్టివ్‌గా ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా జోడించాడు వర్మ.

మరిన్ని వార్తలు