ఆనందం.. విరాళం

29 Aug, 2019 00:20 IST|Sakshi
అన్షులా కపూర్‌, వరుణ్‌ ధవన్

తమ అభిమాన స్టార్స్‌ని కలవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలా స్టార్స్‌ను ఫ్యాన్స్‌ను కలిపేలా ఓ ఈవెంట్‌ ఏర్పాటు చేసి దాన్ని చారిటీకి ఉపయోగించాలనుకుంటున్నారు అన్షులా కపూర్‌. ఇంతకీ అన్షులా కపూర్‌ ఎవరంటే.. నిర్మాత బోనీ కపూర్‌ మొదటి భార్య కుమార్తె. నటుడు అర్జున్‌ కపూర్‌ చెల్లెలు. నాన్న, అన్నలా సినిమాల్లోకి రాలేదు అన్షులా. అయితే సేవా కార్యక్రమాలు చేయడం తనకి చాలా ఇష్టం. ఇందులో భాగంగానే ‘ఫ్యాన్‌ కైండ్‌’ అనే ఆన్‌లైన్‌ ఫండ్‌ రైజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను స్థాపించారామె. మన అభిమాన స్టార్స్‌తో క్రికెట్, బేకింగ్, పింట్‌ బాల్‌.. ఇలా సరదాగా గేమ్స్‌ ఆడుకోవచ్చు.

ఇందుకోసం 300 పెట్టి ఎంట్రీ టికెట్‌ తీసుకోవాలి. ఈ టికెట్స్‌తో వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తం విరాళాలకు ఉపయోగిస్తారట.  బాలీవుడ్‌ యాక్టర్స్‌ వరుణ్‌ ధవన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హాలు ఈ ఫ్యాన్‌కైండ్‌ సంస్థతో అనుబంధమయ్యారు. ‘‘నీటి కొరత వల్ల ఈ ఏడాది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఈవెంట్‌తో వచ్చిన డబ్బుని వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు వరుణ్‌. ‘‘అభిమానులకు వాళ్ల ఆనంద క్షణాలు ఇస్తూనే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు అన్షులా కపూర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...