డ్యాన్స‌ర్ల‌కు ఆర్థిక స‌హాయం చేసిన హీరో

11 Jul, 2020 13:46 IST|Sakshi

ముంబై: క‌రోనా కార‌ణంగా షూటింగులు లేక దాదాపు నాలుగు నెల‌లైంది. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చాలామందికి ప‌నిలేకుండా పోయింది. ఇక జూనియ‌ర్ ఆర్టిసులు, డ్యాన్స‌ర్లు, టెక్నీషియ‌ల ప‌రిస్థితి మ‌రీ ద‌య‌నీయంగా మారింది. వీరికి చేయూత‌నిచ్చేందుకు ప‌లువురు సినీ పెద్దలు ముందుకు వ‌చ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో వ‌రుణ్ దావ‌న్ సైతం త‌న‌వంతు సాయం అందించాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 200 మంది డ్యాన్స‌ర్లకు కొంత మేర న‌గ‌దు స‌హాయం చేశాడు. వ‌రుణ్‌కు  డ్యాన్స్‌పై ఎంత మ‌క్కువ ఉందో వేరే చెప్ప‌క్క‌ర్లేదు. డ్యాన్స్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ఎబిసిడీ2, స్ట్రీట్ డాన్సర్ సినిమాల్లో వ‌రుణ్ దావ‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. (న‌టి కుటుంబం మొత్తానికి క‌రోనా పాజిటివ్)

ఈ నేప‌థ్యంలోనే 200 మంది నృత్య‌కారుల‌కు వ‌రుణ్‌ ఆర్థిక స‌హాయం చేశాడ‌ని ప్ర‌ముఖ సినీ కో ఆర్డినేట‌ర్ రాజ్​ సురానీ ప్ర‌క‌టించాడు. ఎంతోమంది నిరుపేద డ్యాన్స‌ర్ల స‌మ‌స్య‌ల‌ను సైతం ప‌రిష్క‌రిస్తామ‌ని, త్వ‌ర‌లోనే వారికి జోవ‌నోపాధి క‌ల్పిస్తామ‌ని వ‌రుణ్‌ హామీ ఇచ్చిన‌ట్లు సురానీ అన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఎంతోమంది క‌ళాకారుల‌కు స‌హాయం చేస్తున్నార‌ని వారంద‌రికీ మ‌రోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా మంది టెక్నీషియన్లు ఇంటి అద్దె చెల్లించ‌లేక‌, మందులు కొనేందుకు డ‌బ్బులు లేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. (‘రాధేశ్యామ్‌’ రికార్డు! )

మరిన్ని వార్తలు