వరుణ్‌ కూలీ నెం.1 మూవీ న్యూగ్లింప్స్‌

2 Jan, 2020 20:48 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త పోస్టరును చిత్ర యూనిట్‌ తాజాగా షేర్‌ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లు వధూవరులుగా కనువిందు చేశారు. ఫిలింట్రేడ్‌ అనలిస్టు ట్విటర్‌లో ఈ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ.. ‘డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో వాసు భగ్నానీ, జాక్లీ భగ్నానీ, దీప్షిక దేశ్‌ముఖ్‌లు తెరకెక్కిస్తున్న వరుణ్‌, సారాల కూలీ నెం.1 2020 న్యూగ్లింప్స్‌’ అని పేర్కొన్నారు. ఇందులో ధావన్‌ వైట్‌ సూట్‌ ధరించగా.. వెడ్డింగ్‌ ఫ్రాక్‌లో సారా ఫొటోకు ఫోజులిచ్చారు.

కాగా గతేడాది ఆగష్టులో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలింసిందే. అందులో ధావన్‌ ఎరుపు రంగు చొక్కా, తెల్లటి ప్యాంటు, నెహ్రు టోపి ధరించి కూలీలా కనిపిస్తాడు. ఇక 1995లో విడుదలై విజయం సాధించిన కూలీ నెం.1 సినిమాను అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు దర్శకుడు డేవిడ్‌ ధావన్‌. ఆనాటి కూలీ నెం.1లో గోవింద, కరిష్మా కపూర్‌లు నటించగా.. రీమేక్‌లో వరుణ్‌, సారా జోడికట్టారు. ఇది తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్‌ నటించడం రెండోసారి. ఈ సినిమా 2020 మే1న విడుదల కానున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు