నంబర్‌ 1 కూలీ

3 May, 2019 03:10 IST|Sakshi
వరుణ్‌ ధావన్‌

కొత్త లైసెన్స్‌ తీసుకుని పని మొదలుపెట్టాడు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. కానీ వరుణ్‌ లైసెన్స్‌ తీసుకున్నది కూలి పని చేయడానికి. కొత్తగా కష్టం ఏం రాలేదు. కొత్త సినిమా ‘కూలీ నం 1’ను స్టార్ట్‌ చేశాడంతే. వరుణ్‌ ధావన్‌ హీరోగా డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో ‘కూలీ నం.1’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సారా అలీఖాన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 1 కార్మిక దినోత్సవం  సందర్భంగా స్టార్ట్‌ చేశారు వరుణ్‌ ధావన్‌. ‘‘సరిగ్గా ఏడాది తర్వాత నం.1 కూలీ వస్తాడు. మస్త్‌ మజా చేస్తాడు’’ అని ఈ సందర్భంగా వరుణ్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. డేవిడ్‌ థావన్‌ దర్శకత్వంలోనే 1995లో వచ్చిన ‘కూలీ నం.1’ చిత్రానికి ఈ 2019 ‘కూలీ నం.1’ రీమేక్‌ అని బీటౌన్‌ టాక్‌.

మరిన్ని వార్తలు