చెక్‌ ఇవ్వాలనుంది

20 Apr, 2019 02:58 IST|Sakshi
వరుణ్‌ ధావన్‌

‘‘ఏదో ఒకరోజు నిర్మాతగా మారతాను. చెక్‌లిస్తాను. కానీ సినిమా సెట్లో మాత్రం లావాదేవీల గురించి మాట్లాడుతూ సీరియస్‌ నిర్మాతలా మాత్రం ప్రవర్తించను’’ అంటున్నారు బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. కెరీర్‌లో ఎక్కువ శాతం విజయాలు నమోదు చేసుకుని ‘ప్రొడ్యూసర్స్‌కు సేఫ్‌ బెట్‌’ అనే పేరు సంపాదించారు వరుణ్‌. లేటెస్ట్‌గా నిర్మాతగా మారాలనే ఆలోచన ఉందని తెలిపారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘నటుడిగా నా సినిమాల ద్వారా నిర్మాతలకు డబ్బు రావాలని కోరుకుంటాను. నా మీద ఇన్వెస్ట్‌ చేస్తున్నందుకు వాళ్లు నష్టపోకూడదు. ప్రస్తుతం నేను హీరోగా చేస్తున్న ‘కూలీ నెం.1’ మా సొంత ప్రొడక్ష¯Œ లో తీస్తున్నాం. ఈ చిత్రానికి మా నాన్న∙డేవిడ్‌ ధావన్‌ దర్శకుడు. నేను హీరోగా నటించడంతో పాటు ఈ సినిమా ప్రొడక్షన్‌ను కూడా చూసుకుంటాను. త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాతగా మారతాను’’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు